చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో సాగునీటి ప్రాజెక్ట్‌ను నీటి పారుదల శాఖ ఈఈ ఉదయ కుమార్ రెడ్డి సందర్శించారు. సాగునీటి ప్రాజెక్టు ప్రస్తుతం 90 శాతం నిండిందని తెలిపారు. పైనుంచి ప్రవాహాలు వస్తున్నందున త్వరలో పూర్తిస్థాయిలో నిండిపోతుందని పేర్కొన్నారు. జూలైలోనే ప్రాజెక్ట్‌లోకి సమృద్ధిగా నీరు రావడం వల్ల ఏడాదికి రెండు గంటల పాటు సాగర్ నీటిని విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. అలాగే కుడి, ఎడమ కాలువల ద్వారా తంబళ్లపల్లి, పెద్దమండ్యం మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దేరు ప్రాజెక్ట్ కాలువలు కంప చెట్లతో నిండిపోయాయి. పూడిక తీస్తే గాని పూర్తి స్థాయిలో పంట భూములకు సాగునీరు అందుతుంది. భవిష్యత్తులో కాలువలకు ఇరువైపులా గోడలు నిర్మించేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతామని ఈఈ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :