రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న అక్రమాలు, అవినీతి, తెదేపా శ్రేణులను ఆర్థికంగా దెబ్బతీయడం వంటి వాటిని నిరసిస్తూ.. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించే వారిని వైకాపా ప్రభుత్వం బెదిరిస్తోందని.. వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో అధికార పార్టీ నేతలు పేదల ఇంటి స్థలాలను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి...: కొండల్లో శవమై కనిపించిన వివాహిత.... భర్తపై అనుమానం!