ETV Bharat / state

ఎంజేఆర్ విద్యా సంస్థల ఛైర్మన్ అనుమానాస్పద మృతి - Chittoor district Latest news

చిత్తూరు జిల్లా పీలేరు ఎంజేఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పీలేరు - పులిచర్ల రైల్వే ట్రాక్‌పై వెంకట్రామి రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య లేదా ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తరచూ సాయంత్రం నడక కోసం వెంకట్రామిరెడ్డి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లేవారని సమాచారం.

Suspicious death of Chairman of MJR Educational Institutions

author img

By

Published : Feb 11, 2021, 10:17 PM IST

చిత్తూరు జిల్లా పీలేరులోని ఎంజేఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం సాయంత్రం పీలేరు - పులిచర్ల రైల్వేట్రాక్​పై వెంకట్రామిరెడ్డి మృత దేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో వెంకట్రామిరెడ్డి మృతదేహం ఛిద్రమైపోయి ఉంది.

ఇది.. ఆత్మహత్యా లేదా ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతకొంత కాలంగా తరచూ సాయంత్రం నడక కోసం రైల్వేట్రాక్ వద్దకు వస్తున్న వెంకట్రామిరెడ్డి... ఈరోజు తిరుపతి - గుంతకల్ ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే సమరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.