తిరుమల(Tirumala) శ్రీవారిని న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న(Supreme Court Judge Justice Nagaratna), తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా(Telangana High Court Judge Justice Srisudha) స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తులకు స్వాగతం పలికిన తితిదే అధికారులు.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి