చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం సీగొల్లపల్లె పంచాయతీ ఇంగంవారిపల్లెకు చెందిన విద్యార్థులు ప్రమాదకరంగా ఏరు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో గతంలో పాఠశాల ఉండేది. ఇక్కడ బడిని ఎత్తేయడంతో 32 మంది విద్యార్థులు కిలోమీటరు దూరంలోని దొమ్మరపల్లె బడికి వెళ్తున్నారు. వీరెళ్లే మార్గంలో వాగు, ఏరు దాటాల్సి వస్తోంది. వర్షాలకు ఏరులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు లోతు తక్కువ ఉన్న చోట పాకుడు పట్టిన బండల మీదుగా అత్యంత ప్రమాదకరంగా ఏరు దాటుతున్నారు. కనీసం దారి కూడా సక్రమంగా లేదు. వంతెన నిర్మించి దారి చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Divert Deposits: ఆ నిధులు ఏపీ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌కు మళ్లించాల్సిందే !