ETV Bharat / state

చిత్తూరులో చిక్కుకున్న కూలీలు, విద్యార్ధులను స్వస్థలాలకు తరలింపు - చిత్తూరులో వలస కూలీల వార్తలు

చిత్తూరు జిల్లాలో చిక్కుకున్న బీహర్​కు చెందిన వలస కూలీలను, విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు. వీరి కోసం శ్రామిక్ ఎక్స్ ప్రెస్ పేరిట ప్రత్యేక రైలును ఎంపీ రెడ్డప్ప, కలెక్టర్​ భరత్​ గుప్తా ప్రారంభించారు. వలస కూలీలకు స్క్రీనింగ్​ పరీక్షల అనంతరం ప్రయాణానికి అనుమతిని ఇచ్చారు.

students and migrant labours shift to their own towns
కూలీలు, విద్యార్ధులను స్వస్థలాలకు తరలింపు
author img

By

Published : May 7, 2020, 9:19 PM IST

లాక్ డౌన్ కారణంగా చిత్తూరు జిల్లాలోని వివిధ పట్టణాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రామిక్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైలు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి బీహర్ రాష్ట్రానికి బయలు దేరింది. ఎంపీ రెడ్డప్ప, కలెక్టర్ భరత్ గుప్తా దీన్ని ప్రారంభించారు. ఈ రైలులో 1153 మంది వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించారు. కలికిరి సైనిక్ స్కూల్ కు చెందిన 122 మంది విద్యార్థులు కూడా తమ సొంత రాష్ట్రం బీహర్​కు బయలుదేరారు. వీరికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రయాణానికి అనుమతించారు.
ఇవీ చూడండి...

వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తున్న ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.