ETV Bharat / state

కరోనా కాలంలో కొండంత అండగా... సరైన సమయంలో 'గురు దక్షిణ'!!

తల్లి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే.... మనకి ప్రపంచాన్ని పరిచయం చేసే వారు మాత్రం మన గురువులే. పలకా బలపంతో అక్షరాలు దిద్దించిన దగ్గరినుంచి... జీవితంలో స్థిరపడేవరకు ప్రతిదశలోనూ ఉపాధ్యాయులే బాసటగా నిలుస్తారు. అలాంటిది, ఈ కరోనా మహమ్మారి ఎందరో మాస్టార్ల జీవితాలు తలకిందులు చేసింది. మరీ ముఖ్యంగా, ప్రైవేట్ టీచర్ల వేదన వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో... తమ అభ్యున్నతిలో తోడుగా ఉన్న టీచర్లకు... కష్టకాలంలో అండగా నిలుస్తోంది... చెన్నె- ఎస్​ఆర్​ఎమ్​ కళాశాలకు చెందిన పూర్వవిద్యార్థుల బృందం.

students helps to teachers
ఉపాధ్యాయులను ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు
author img

By

Published : May 5, 2021, 5:50 PM IST

ఉపాధ్యాయులను ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు

మాస్టర్స్ చదివిన ఓ మాస్టారు అరటిపళ్లు విక్రయిస్తున్న దృశ్యాలు.. పీజీ చదివిన ఓ ప్రైవేట్ టీచర్.. టిఫిన్ బండితో బతుకు బండి లాగుతున్న పరిస్థితులు.. మరో గురువుగారైతే ఏకంగా పాదరక్షలు అమ్ముకుంటున్న తీరు.. ఇవన్నీ కరోనా విలయం సృష్టించిన కల్లోలాలు. మహమ్మారి కారణంగా ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడిన వేళ.. జీతాలివ్వలేక యాజమాన్యాలు చేతులెత్తేస్తే.. ఉద్యోగాలను పోగొట్టుకుని.. బతుకు తెరువు కోసం రోడ్లమీద పడిన ఎందరో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏడాదిన్నరగా చూస్తూనే ఉన్నాం. అలాంటి వారి వేదనను రూపుమాపేలా ఓ యువబృందం నడుం బిగించింది. తమతో అక్షరాలు దిద్దించి లోకాన్ని పరిచయం చేసిన గురువుల రుణం తీర్చుకునేలా అభిమన్యు, భీష్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఆ యువ బృందం.

గురువులకు సాయం చేయాలని...

తిరుపతికి చెందిన 24 ఏళ్ల యువకుడు నీలేష్ కుమార్.. చెన్నైలోని ఎస్ఆర్ఎం కళాశాలలో 2017లో బీటెక్ పూర్తి చేశాడు. కళాశాల సమయం నుంచే తనకు స్నేహితులైన ప్రశాంత్, అఖిల్, విష్ణు, రుచిక, జ్ఞానశ్రీ, గవీన్ లతో కలిసి ఏదైనా సమాజహిత కార్యక్రమాలను చేయాలని ఆలోచించేవాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా వేర్వేరు చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

మంచి ఉద్యోగాలు.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న తరుణంలో గతేడాది కరోనా మహమ్మారి విలయంలా ముంచుకువచ్చింది. నెమ్మదినెమ్మదిగా ప్రజల జీవితాలను పాతాళానికి తొక్కేస్తూ తీవ్రంగా నష్టపోయేలా చేసింది. ఎంతో మంది ఉపాధి అవకాశాలను, ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి సమయంలో టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో జీతాలు రాక, ఉద్యోగాలు పోయి ప్రైవేట్ టీచర్లు రోడ్లపై వేర్వేరు పనులు చేసుకుంటున్నారనే వార్తలు నీలేష్ కి కనిపించాయి.

చిన్ననాట తమతో అక్షరాలు దిద్దించి ఇంత ప్రయోజకులను చేసిన గురువులకు వచ్చిన ఈ కష్టాన్ని చూసి చలించిపోయి స్నేహితులతో చర్చించాడు. అనుకున్నదే తడవుగా తమవంతుగా ఏదైనా గురువులకు సహాయం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్లంతా చెన్నైలో కలిసి చదువుకోవటానికి ముందు... మన రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. అప్పుడు చదువు చెప్పిన పాఠశాలలకు వెళ్లి.. టీచర్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు. నెలలకు నెలలు బడులు మూసేయటం ద్వారా ఎంతో మంది గురువులు ఉపాథి కోల్పోయి ఇళ్లు గడవటం కష్టంగా మారిన పరిస్థితులను చూసి ఆ యువతీయువకులు కదిలిపోయారు. తమకు వస్తున్న జీతాల నుంచి కొంత మొత్తాన్ని వేరు చేసి గురు దక్షిణగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఆ స్ఫూర్తితో...

కళ్ల ముందున్న వ్యూహాన్ని ఎలా చేధించాలో తెలియకపోయినా.. తనవాళ్లకు అండగా ఉండాలని నమ్మకం కలిగించిన అభిమన్యుడి స్ఫూర్తితో అభిమన్యు ది హోప్ అని, తన వాళ్ల కోసం తనకున్న జ్ఞానసంపదను పంచుతూ కాపాడుకుంటూ వచ్చిన భీష్ముడి స్ఫూర్తితో భీష్మ ది సేవియర్ అని రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత గురువులకు చేసుకునే సేవ ప్రచారం లా ఉండకూడదనే ఉద్దేశంతో మూడో వ్యక్తికి తెలియకుండా నగదు సహాయం, నిత్యావసరాల పంపిణీ చేసి వారికి మద్దుతగా నిలిచారు.

గురువులతో పాటు తమ బడినే నమ్ముకుని ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సైలెంట్ హెల్ప్ నినాదంతో వారిని ఆదుకున్నారు. వేరే వాళ్లకు చేసే సహాయాన్ని తమ గురువు చేతుల మీదుగా చేయించటం ద్వారా వారికే ఆ ఫలితాన్ని దక్కేలా చేశారు. అలా గతేడాది ఈ యువ బృందం తిరుపతి, విజయవాడ, నెల్లూరు, విశాఖ, హైదరాబాద్ లలో దాదాపు 335 కుటుంబాలను అక్కున చేర్చుకుని వారికి కావాల్సిన సకల సౌకర్యాలను సమకూర్చిపెట్టింది. చిన్నప్పుడు ఏం తెలియని వయస్సు నుంచి తమ విద్యాబుద్ధులను నేర్పిన గురువులు కష్టపడకూడదనే ఉద్దేశంతో తమకు చేతనైన సహాయాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ అభిమన్యు, భీష్మలను ప్రారంభించామని బృందసభ్యులు చెబుతున్నారు.

ఎంతో మందికి నిదర్శనం

పేరు చెప్పకుండా సహాయం చేయాలనే ఆలోచనే మంచిదే అయినా....చేసే ప్రతీ పనీ మరో నలుగురిలో స్ఫూర్తిని నింపాలంటే...చేసే పనిని తర్వాతి తరానికి సందేశం రూపంలో అందివ్వాలనే తమ గురువుల ఆదేశాలతో....విద్యార్థుల్లో అవగాహన కల్పించటం ప్రారంభించారు. తమలానే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులకు నీలేష్ బృందం అవగాహన కల్పిస్తోంది. అంతే కాదు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా నేటి తరం విద్యార్థుల్లోనూ ఆలోచనను రగిలిస్తోంది.

ప్రస్తుతం కోవిడ్ రెండో దశ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో....పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు, పనిచేసే సిబ్బందికి హెల్త్ కిట్లు, మందులు, నిత్యావసర సరుకులను అందిస్తోంది ఈ యువ బృందం. పరిస్థితులను అర్థం చేసుకుని ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చదువు చెప్పిన దానికి కృతజ్ఞతగా నీలేష్ బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఈ ఆపత్కాల సమయంలో నీలేష్ బృందం చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సహకారం మర్చిపోలేనిదని....వారికి గురువులపై ఉన్న గౌరవానికి, సామాజిక బాధ్యతకు ఇది నిదర్శమని కొనియాడుతున్నారు.

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు సహాయం చేసే అవకాశం కలుగుతోందని నీలేష్ బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా ఒక్కసారి గతంలోకి వెళ్లి తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుని వారికి బాసటగా నిలిస్తే గురువు రుణం తీర్చుకునే అదృష్టం దక్కుతుందని సందేశమిస్తున్నారు.

ఇదీ చదవండి:

కదులుతున్న రైల్లో నుంచి దూకిన మహిళ...రక్షించిన కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.