చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం ఉప ఖజానా కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నపాటి వర్షానికి సైతం.. నీరు లోపలికి వస్తుండటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవనం నూతన ఫించన్లు, ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. కార్యాలయానికి వచ్చే వృద్ధులు కూర్చునేందుకు సైతం వీలు లేకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 95 లక్షల రూపాయల మేర నిధులు సమకూర్చినా.. పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. దీనివల్ల శిథిలమైన భవనంలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై శ్రీకాళహస్తి ఖజానా కార్యాలయం అధికారి సెల్వ కుమార్ మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: మంత్రి పెద్దిరెడ్డిని పోలీసు స్టేషన్లో విచారణ చేయాలి: వర్ల