వరద ప్రవాహంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నష్టం వాటిల్లింది. ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట - గుడిమల్లం ప్రధాన రహదారిపై స్వర్ణముఖి నది కాజ్ వే కొట్టుకుపోవడంతో గుడిమల్లం, పెను మల్లం, పెనగడం, రావిళ్ల వారికండ్రిగ ప్రజలు 10 కిలోమీటర్ల మేర ప్రయాణించి చెల్లూరు మీద రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు కొట్టుకుపోవడంతో ఇసుక మేట లతో దర్శనమిస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఏర్పేడు- సదాశివ పురం, శ్రీకాళహస్తి -పాపా నాయుడు పేట, శ్రీకాళహస్తి- పల్లం ప్రధాన రహదారి రాకపోకలు ఇంకా కొనసాగలేదు.
ఇదీ చదవండి: