ETV Bharat / state

శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ప్రారంభం

కరోనా కారణంగా మూతపడ్డ జూ పార్కులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించారు. సందర్శకులు తప్పని సరిగా కొవిడ్​ నిబంధనలు పాటించాలని క్యూరేటర్ హిమశైలజా తెలిపారు.

Sri Venkateswara Zoo park start today onwards
శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ప్రారంభం
author img

By

Published : Nov 16, 2020, 7:11 PM IST

కొవిడ్​ నిబంధనల్లో భాగంగా మూసివేసిన శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది. సందర్శకులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని క్యూరేటర్ హిమశైలజా అన్నారు . ఆన్లైన్ బుకింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. మాస్కులు,శానిటేషన్, భౌతిక దూరం పాటించాలని సందర్శకులకు సూచించారు. అలాగే ఎంట్రన్స్ లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి సందర్శకులను అనుమతిస్తున్నామని చెప్పారు.

దాదాపు 7 నెలల తర్వాత జూ పార్కు ప్రారంభమవ్వటంతో సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపారు. థియేటర్లు, పార్కులు వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు లాక్ డౌన్ కారణంగా మూతపడడంతో విసిగిపోయామని... జూ పార్కు తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని సందర్శకులు అన్నారు. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ప్రారంభం

ఇదీ చదవండి:

పరువు నష్టం దావా కేసుపై తితిదే కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.