తమను స్వస్థలకు పంపాలంటూ చిత్తూరు జిల్లాలో వలస కార్మికులు ఆందోళన చేయడంతో అధికారులు స్పందించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో పనిచేస్తున్న 348 మంది ఝార్ఖండ్ వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై చర్చలు జరిపిన రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. సత్యవేడు తహసీల్ధార్ శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీసిటీ ప్రతినిధులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను తరలించారు.
ఇవీ చూడండి...