తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, చంద్రగిరి నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ పులివర్తి నానిలు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని నారావారిపల్లి గ్రామస్థులు శ్రీ శేషాచల లింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. ఈసందర్భంగా నారావారిపల్లి సర్పంచ్ లక్ష్మీ, ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి మాట్లాడుతూ.. వివిధ వేరియంట్లతో కరోనా మహమ్మరి ప్రజలను పట్టి పీడిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, పులివర్తి నానిలు వైరస్ బారిన పడ్డారని తెలిపారు. వారందరూ..సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తిరిగి రావాలని గ్రామస్థులంతా ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ఆదివారం పీక్ స్టేజ్‌కు కరోనా థర్డ్ వేవ్.. ఎన్ని కేసులు వస్తాయంటే...'