చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్.. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని రాయల్ చెరువు గేట్ అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రూ.15 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు 75% పూర్తయ్యాయని మరో 25 శాతం సెప్టెంబర్‌లోగా పూర్తి చేస్తామని చెప్పారు. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి విమానాశ్రయం వైపు వెళ్లేందుకు అన్ని మౌలిక సదుపాయాలతో రెండో ముఖద్వారం ఏర్పాటు చేయనున్నట్లు జనరల్ మేనేజర్ గజానన్ మల్యా తెలిపారు.
ఇవీ చదవండి