చిత్తూరు జిల్లా గంగవరం మండలం కిలపట్ల క్రాస్ వద్ద ఓ ద్విచక్ర వాహనంలోకి పాము పిల్ల దూరింది. సిమెంట్ తయారీ కేంద్రం వద్ద కనిపించిన ఈ పాము పిల్లను తరిమేందుకు కూలీలు ప్రయత్నించారు. చుట్టూ జనం చేరి శబ్దాలు చేస్తూ ఉండగా భయపడిన పాము పిల్ల అక్కడే ఉన్న బైకులోకి దూరింది. చైనులో ఇరుక్కుంది. దానిని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. సుమారు 40 నిమిషాలపాటు చైనులోనే ఇరుక్కున్న పాము పిల్ల.. చివరికి చనిపోయింది.
ఇదీ చదవండి