చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం నారాయణపురంలో పెంటకుప్పలో అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం 4నెలల క్రితం అదృశ్యమైన అమ్ములుగా గుర్తించారు. ఆమె అల్లుడు నాగరాజే హత్య చేశాడని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు.
అస్థిపంజరం లభించిన చోటే అల్లుడి వస్త్రాలు...
గతేడాది డిసెంబర్లో అమ్ములు అదృశ్యమవగా.. బంధువులు శ్రీకాళహస్తి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కనే ఉన్న పెంటకుప్పలో అస్థిపంజరం బయటపడడం, అక్కడే ఆమె అల్లుడి వస్త్రాలు లభ్యమవడంతో అతనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: నంది విగ్రహం చోరీ కేసు.. నిందితులు అరెస్ట్