చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం తుమ్మలగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొనగా..ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనంతపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
గాయాలపాలైన వారిని పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విరుపాక్షిపురంలో పక్షవాతానికి మందు తీసుకొని.. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: