రాయలసీమ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో సిద్ధేశ్వరాలం ప్రముఖమైంది. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వైదుంభరాజులు ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. కడప జిల్లా సిద్ధవటం సంస్థానాన్ని పరిపాలించిన చంద్రగుప్త మహారాజు కుమార్తె సత్యవతి కన్యగా అడుగుపెట్టిన కారణంగా ఇక్కడి నదిని సత్యవతి నది అని పిలుస్తారు. ఇక్కడ ఏటా జరిగే తిరునాళ్లకు వేలసంఖ్యలో భక్తులు వస్తారు. సంతానప్రాప్తి కోసం స్వామిని వేడుకుంటారు. మహా శివరాత్రి పర్వదినాన.. నదిలో స్నానంచేసి, తడి బట్టలతో స్వామిని ప్రార్థిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇవీ చదవండి: