శ్రీవారిని ప్రార్థిస్తూ వసంత మండపంలో లోక సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షోడశదిన సుందరకాండ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఉదయం హనుమంతుని జయ మంత్రంతో వసంత మండపం ప్రతిధ్వనించింది.
38వ సర్గ నుంచి 45వ సర్గ వరకు ఉన్న 278 శ్లోకాలను వేద శాస్త్ర పండితులు దీక్షా శ్రద్ధలతో పారాయణం చేశారు. షోడషాక్షరి మహామంత్రం ప్రకారం 11వ రోజు ద అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని 278 శ్లోకాలను చెప్పారు.
ఇదీ చూడండి:
అనాథలైన పిల్లలకు ఆశ్రయం.. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 181, 1098