చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొంతమంది గోవును తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. గోమాత లేనిదే ఏ ఇంట శుభకార్యం తలపెట్టరు. గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకటరమణ, భారతి దంపతులు ఓ అడుగు ముందుకేసి గోవుకు శ్రీమంతం చేశారు. గ్రామానికి చెందిన ముత్తైదువులతో ఆవుకు పసుపు కుంకుమ పెట్టించారు. అనంతరం కర్పూర హారతులు పట్టి ఆవుకు పండ్లు, ప్రసాదాలు తినిపించారు.
ఇదీ చదవండి
ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!