గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు చిత్తూరు జిల్లాలో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా గ్రామ, సచివాలయాల్లో 1873 ఖాళీలుండగా.. వీటికోసం 97 వేల 333 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఒక్క తిరుపతిలోనే 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా..చిత్తూరు, మదనపల్లె, కుప్పం సహా మరో 5 మండలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలనుంచి 12: 30 వరకు.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. కరోనా వైరస్ విస్తృతి ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్ఖులకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి. చెట్టును ఢీకొన్న కారు...ముగ్గురు యువకులు మృతి