ETV Bharat / state

గుట్టు చప్పుడు కాకుండా సర్వే..!

అధికార పార్టీ బంధువుకు క్వారీ కేటాయింపులకోసం చిత్తూరు జిల్లాలో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సర్వేలు నిర్వహించారు. పొలాలకు ఆనుకుని ఉన్న కొండల్లో గుర్తులు వేసి ఉండడంపై ఆగ్రహించిన అక్కడి రైతులు.. క్వారీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దారు మాత్రం దీనిపై తనకేమీ సమాచారం లేదని చెబుతున్నారు.

farmers aggitation in chittor district over quarry allotments
గుట్ట చప్పుడు కాకుండా సర్వే..!
author img

By

Published : Jan 30, 2021, 3:56 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అగరాల, కొటాల గ్రామ పంచాయతీల మధ్యలో.. పంట పొలాలకు ఆనుకొని ఉన్న కొండలపై క్వారీ వ్యాపారుల కన్ను పడింది. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు తోడవటంతో గుట్టుచప్పుడు కాకుండా కొలతలు వేసి సరిహద్దుల్లో గుర్తులు వేయటం చకచకా జరిగిపోయాయి. పంట పొలాలకు ఆనుకొని ఉన్న కొండల్లో కొలతలు వేయటాన్ని గమనించిన కొటాల గ్రామ రైతులు ఆ సర్వే ఎందుకోసం.. ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించగా..అక్కడి వారి నుంచి సమాధానం రాలేదు. గుట్టుచప్పుడు కాకుండా క్వారీ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు తెలుసుకున్న రైతులు పంట పొలాలకు ఆనుకొని క్వారీ నిర్వహిస్తే పంటలు సర్వనాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వేసిన గుర్తులు:

డ్రోన్​ సాయంతో సర్వే..

కొటాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 557లో సుమారు 140.93 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొటాల గ్రామానికి చెందిన 15 మంది రైతులకు సంబంధించిన పట్టాదారు భూములు కలసి ఉన్నప్పటికీ సమీపంలోని కొండ ప్రాంతంలో గత మూడు రోజులుగా డ్రోన్‌ యంత్రాల సాయంతో సర్వే నిర్వహించి గుర్తులు వేశారు. పట్టాదారు భూముల్లోనూ సరిహద్దు రాళ్లు నాటుతుండగా కొటాల గ్రామానికి చెందిన వరదయ్యనాయుడు, ప్రతాప్‌చౌదరి, శేఖర్‌ నాయుడు, దీనదయాల్‌ నాయుడుతో పాటు మరికొంత మంది గ్రామ రైతులు సర్వే చేస్తున్న వారిని నిలదీశారు. ఎవరు మీరు?.. అనుమతి లేకుండా పట్టా భూముల్లో గుర్తులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదని గగ్గోలు పెడుతున్నారు.

అధికార పార్టీ బంధువుకోసం..

తరువాత అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువుకు ఆ ప్రాంతంలో క్వారీ కేటాయింపు కోసం కొలతలు వేసినట్లు తెలుసుకున్న రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పంటపొలాలకు ఆనుకొని క్వారీకి అనుమతిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరిపినందున జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఆ గ్రామానికి చెందిన దీనదయాల్‌ నాయుడు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహసీల్దారు చిన్న వెంకటేశ్వర్లును అడగగా..ఎవరు సర్వే చేశారో, ఎందుకు వచ్చారో తమకు తెలియదని, క్వారీ అనుమతులకు సంబంధించి ఎలాంటి ఫైలు తమకు రాలేదని స్పష్టం చేశారు.

క్వారీ అనుమతులు రద్దు చేయండి..

కొటాల గ్రామ పంచాయతీ రైతుల భూములకు ఆనుకొని ఉన్న దుర్గం కొండపై క్వారీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. భూ సర్వే చేసి గుర్తులు పెట్టిన ప్రాంతానికి చేరుకున్న రైతులు క్వారీ అనుమతులు రద్దు చేయాలని నినదించారు. న్యాయ పోరాటం చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.