ETV Bharat / state

పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం

మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో కార్మికులు ధర్నా నిర్వహించారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

chittor district
పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Jul 27, 2020, 4:26 PM IST

పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని చిత్తూరు జిల్లా మదనపల్లి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. కార్మికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని ఇలాంటివారికి ప్రభుత్వం తగిన విధంగా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్మికులకు గ్లౌజులు, శానిటైజర్ లు మంజూరు చేసి కొవిడ్ పరీక్షలు చేయాలన్నారు. కరోనా వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి 'విలన్‌గా చూడలేం.. హీరో పాత్ర వేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.