ఇసుకరీచ్ ప్రారంభంలో ఉద్రిక్తత - చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు, ఎంఎస్ బాబు వర్గీయులకు మధ్య వాగ్వాదం
చిత్తూరు జిల్లాలో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. చిత్తూరు గ్రామీణ మండలం ఆనగల్లులో ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వర్గీయులు అడ్డుకున్నారు. ఇసుక రీచ్‌ను చిత్తూరు ఎమ్మెల్యే తనకు అనుకూలమైన వ్యక్తికి ఇచ్చారని స్థానికంగా ఉన్న ఎంఎస్ బాబు వర్గీయులు ఆరోపించారు. ఈ సందర్భంగా రీచ్‌ను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఇసుక రీచ్‌ను చిత్తూరు ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇసుకరీచ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం
By
Published : Mar 6, 2020, 7:21 PM IST
.
ఇసుకరీచ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం