చంద్రగిరిలో ఇసుక అక్రమ తరలింపును పోలీసులు దాడులు చేసి నిలువరించారు. తెల్లవారుజామున రామిరెడ్డి పల్లి, నాగయ్యగారి పల్లి, కోటాల గ్రామ సమీపంలోని స్వర్ణముఖీ నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఐ రామచంద్రారెడ్డి హెచ్చరించారు. రంగంపేట, శానంబట్ల, కోటాల,రామిరెడ్డిపల్లి, నాగయ్యగారి పల్లి, రెడ్డివారిపల్లి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందగా.. దాడులు చేసినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: