కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి (TTD EO Jawahar reddy) ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని పలుమార్లు సూచించినా కొందరు నిర్లక్ష్యం చేశారని.. అటువంటి వారికి జూన్ నెల జీతాలు ఆపాలని అన్ని విభాగాల హెవోడీలకు ఆయన నోట్ పంపించారు.
ఫ్రంట్ లైన్ సిబ్బందితోపాటు, 45 ఏళ్లకు పైన ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్లో పొందుపరిచారు. టీకా వేసుకున్నట్లు నిర్ధారించిన తర్వాత... మళ్లీ సప్లిమెంటరీ బిల్లులను 8న పంపించాలని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది బిల్లులను మాత్రం వెంటనే చెల్లించాలన్నారు.
ఇదీ చూడండి: