ETV Bharat / state

గదుల కేటాయింపునకు నూతన కేంద్రాలు.. తీరనున్న భక్తుల ఇక్కట్లు - thirumala latest news

తిరుమలలో వసతి గదుల కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన సమస్యను పరిష్కరిస్తూ.. తితిదే చర్యలు చేపట్టింది. గతంలో ఒకే ప్రాంతంలో వసతి గదుల నమోదుకు అవకాశం కల్పించిన తితిదే.. వసతి గదుల నమోదు కేంద్రాలను విస్తరించింది. 50, 100, 1000 రూపాయల అద్దె గదుల నమోదుకు ఆరు ప్రాంతాల్లో 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వసతి గదుల కేటాయింపును సులభతరం చేసింది.

room-registration-centers-developed in thirumala
తిరుమలలో గదుల కేటాయింపునకు నూతన కేంద్రాలు
author img

By

Published : Jun 12, 2021, 9:36 PM IST

తిరుమలలో గదుల కేటాయింపునకు నూతన కేంద్రాలు

కలియుగ వైకుంఠ నాథుడి దర్శనం టికెట్లు పొంది.. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన భక్తులు వసతి గదుల కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారాంతాలు, పర్వదినాల్లో వసతి గదుల కోసం పది నుంచి పన్నెండు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమల వచ్చిన భక్తులు.. వసతి గదుల కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తితిదే.. భక్తుల సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. వసతి గదుల నమోదు, కేటాయింపును సులభతరం చేసేలా చర్యలు చేపట్టింది. తితిదే నిర్ణయంతో తిరుమలలో వసతి గదుల కోసం భక్తులు నిరీక్షించాల్సిన సమస్య తీరింది.

గతంలో వ‌స‌తి కోసం సీఆర్‌ఓ ప్రాంతంలో ఉన్న కేంద్రంలో మాత్రమే భ‌క్తులకు పేర్ల నమోదు, గ‌దులు కేటాయింపు చేసేవారు. సీఆర్‌వో వ‌ద్ద భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండ‌టం, పార్కింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో భక్తులు ఇబ్బంది పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్లు ఏర్పాటు చేయడంతో పాటు తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో మరో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న భ‌క్తుల‌కు సంక్షిప్త సందేశాల ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేసేలా సాఫ్ట్​వేర్‌ రూపొందించారు.

ఇదీచదవండి.

wife fight: 'పదేళ్లు కాపురం చేశాడు..ఇప్పుడు వదలించుకోవాలనుకుంటున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.