ETV Bharat / state

ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు - పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి వార్తలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

road accident at putalapattu-nayudupeta national highway
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 3, 2020, 11:22 AM IST

పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్రప్పగారిపల్లికి చెందిన 11 మంది... తమిళనాడులోని వేదాద్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వీరంతా ఆటోలో తిరిగి ప్రయాణమవుతుండగా... తొండవాడ వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద బారిన పడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు కారణమైన తమిళనాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్​, క్లీనర్ పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి: రెండు పూరిళ్లు దగ్ధం... 49 మేకలు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.