చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో దేవాదాయశాఖ ఆధీనంలోని దేవాలయాలను తిరుపతి ఆర్జేసీ పూర్ణచంద్రరావు సందర్శించారు. ఈనెల 8 నుంచి చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థానమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్జేసీ పేర్కొన్నారు. ప్రధానంగా భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజర్లును అందుబాటులో ఉంచుతామన్నారు. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని దేవాలయ ఈవో పుట్టా రామకృష్ణారెడ్డి, ఆలయ ఛైర్మన్ ఒంటి శివశంకర్‌రెడ్డికి సూచించారు. దేవాలయానికి వేసిన రంగులు, ఆలయ ప్రాంగణంలో పచ్చదనం కలిగిన వాతావరణం బాగుందని ఆలయ ఈవోను అభినందించారు.
చంద్రగిరి దేవాలయాలను సందర్శించిన తిరుపతి ఆర్జేసీ - చంద్రగిరి గ్రామదేవత వార్తలు
చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థానమ్మ దేవస్థానాన్ని తిరుపతి ఆర్జేసీ పూర్ణచంద్రరావు సందర్శించారు. ఈనెల 8 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.