Government Lands: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో హీరా ఇస్లామిక్ సంస్థల ఆధీనంలోని ప్రభుత్వ భూములను హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబరు 34లోని ఎకరం ప్రభుత్వ పోరంబోకు భూమిని హీరా సంస్థ నిర్వాహుకులు ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మించారు. చంద్రగిరి ఎమ్మార్వో శిరీష ఆధ్వర్యంలో ఆక్రమణలను జేసీబీలతో తొలగించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణల కూల్చివేత పనులు చేపట్టారు.
ఇదీ చదవండి: CM Relief Fund: నాడు మహిళా ఆదర్శ రైతు.. నేడు సీఎంఆర్‌ఎఫ్ సాయం కోసం పాట్లు