ETV Bharat / state

CHITTOOR LAND SCAM:  2వేల 320 ఎకరాల భూములను కాజేసిన విశ్రాంత వీఆర్వో - ap latest crime news

భూముల వివరాలు సులభంగా తెలుసుకొనేందుకు, దస్తావేజుల మార్పులతో జరిగే అక్రమాలను అరికట్టేందుకు తెచ్చిన వెబ్‌ల్యాండ్‌ సేవలు అక్రమార్కులకు వరంగా మారాయి. సాంకేతికంగా మార్పు చెందే సమయాన్ని ఆసరా చేసుకొని భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలో విశ్రాంత వీఆర్వో ప్రభుత్వ భూమిని కాజేసిన ఘటన ఇదే తరహాలో జరిగిందని సీఐడీ దర్యాప్తులో తేలింది.

retired-vrv-ganesh-pillai-transferred-govt-lands-in-thename-of-family-members
సర్కారు భూములను కాజేసిన విశ్రాంత వీఆర్వో
author img

By

Published : Oct 5, 2021, 9:31 AM IST

Updated : Oct 5, 2021, 11:37 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా భారీ భూ కుంభకోణం కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 2వేల 320 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యుల పేరుమీద మార్చుకొని రెవెన్యూ అధికారులకు దొరికిన వీఆర్వో గణేష్‌పిళ్లై…పలు అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గుర్తించింది. 2005లో రెవెన్యూ దస్త్రాల కంప్యూటరీకరణ సమయంలో భూ కుంభకోణానికి తెరలేపినట్లు తేలింది.

సర్కారు భూములను కాజేసిన విశ్రాంత వీఆర్వో

గణేశ్‌ పిళ్లై వెబ్‌ల్యాండ్‌ ప్రారంభ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ప్రభుత్వ భూములను మార్చుకున్నారు. మీసేవ, వెబ్‌ల్యాండ్‌లోకి నిక్షిప్తం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్నాళ్లు అక్రమాలు వెలుగులోకి రాలేదని అధికారులు తెలిపారు. భూములను కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకోవడానికి ఎస్టేట్‌ గ్రామాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూముల వివరాలు దస్త్రాల్లో ఉండడంతో ఎస్టేట్ గ్రామాలను ఎంచుకొని అక్రమాలు కొనసాగించారు. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ద్వారా సేకరించిన వివరాలతో అటవీ సమీప భూములు, గుట్టలను కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లోకి గణేశ్‌ పిళ్లై ఎక్కించుకొన్నారు.

దస్త్రాల నిర్వహణ సరిగా లేకపోవడం... ఏళ్ల తరబడి జమాబందీ నిర్వహించకపోవడం వంటి లోపాలతో పిళ్లై అక్రమాలకు పాల్పడ్డారన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. గతంలోలాగా జమాబందీ, రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణం మేరకు శిస్తు వసూలు వంటివి క్రమం తప్పకుండా జరిగితే ఇలాంటి అక్రమాలకు తావుండదంటున్నారు.

ఇదీ చూడండి: Gold Seized: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు

Last Updated : Oct 5, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.