రాష్ట్రంలో రెండోసారి రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బూత్ క్యాప్చరింగ్ ఆరోపణలతో విచారణ చేపట్టిన ఈసీ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. కమ్మపల్లి నార్త్-321, 318 పోలింగ్ కేంద్రాలు, పులివర్తిపల్లిలోని 104 పోలింగ్ కేంద్రం, కొత్తకండ్రిగ-316 పోలింగ్ కేంద్రం, వెంకట్రామపురం 313 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.
ఆ ఐదు ప్రాంతాల్లో 3,899 మంది...
ఆ ఐదు ప్రాంతాల్లో 3,899 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్ఆర్ కమ్మపల్లి పోలింగ్ కేంద్రంలో 698 మంది ఓటర్లు ఉంటే... ఏప్రిల్ 11న... 658 మంది ఓటు వేశారు. కమ్మపల్లి పోలింగ్ కేంద్రంలో ఒక వెయ్యి 28 మంది ఓటర్లకుగానూ...925 ఓట్లు పోల్ అయ్యాయి. పులివర్తిపల్లిలో 805 ఓటర్లకు గాను...765 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తకండ్రిగలో 991 మంది ఓటర్లు ఉంటే.. 812 ఓట్లు పోల్ అయ్యాయి. వెంకట్రామపురంలో 377 మంది ఓటర్లకు గానూ 323 మంది ఓటు వేశారు.
ఈనెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ రీపోలింగ్ జరగనుంది. ఆయా కేంద్రాల్లోని ఓటర్లకు సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించటంతోపాటు..గ్రామాల్లో చాటింపు వేయించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:34రోజుల తర్వాత ఏపీలో రీపోలింగ్ ఎందుకు?