ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ నిరంతర కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. రేణిగుంట సమీపంలోని కృష్ణాపురం పరిధిలో ఐదు ఎర్ర చందనం దుంగలతో పాటు ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రచందన దుంగల అక్రమ తరలింపు.. ఐదుగురు స్మగ్లర్లు అరెస్టు
Intro:5 ఎర్ర చందనం దుంగలతో 5 గురు స్థానిక స్మగ్లర్లు అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు. Body:Ap_tpt_38_27_smaglars_arest_av_ap10100
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో టాస్క్ ఫోర్స్ నిరంతర కూంబింగ్ కొనసాగుతుంది.రేణిగుంట సమీపంలోని కరకంబాడి బీట్ కృష్ణాపురం పరిధిలో ఐదు ఎర్ర చందనం దుంగలతో పాటు ఐదుగురు స్థానిక స్మగ్లర్లును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం చేపట్టిన కూంబింగ్ లో సోమవారం తెల్లవారు జామున తీర్నకుంట బ్రిడ్జ్ వద్ద స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టు ముట్టి పట్టుకున్నారు. వారిని కర్నూలు జిల్లాకు చెందిన వారు స్థానికంగా వుంటూ ఈ అస్మగ్లింగుకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.మల్లికార్జున (36), సిహెచ్. రమణ (39), బి.రఘు (40), పి. మహబూబ్ బాషా (23), బి. శంకర్ (23) గా గుర్తించారు. ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని స్మగ్లర్లు ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.