చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అటవీశాఖ, పోలీసులు దాడులు నిర్వహించారు. యర్రావారిపాళ్యం మండలం, తిరుపతి రూరల్ మండలంలో అధికారుల దాడులలో 46 ఎర్రచందనం దుంగలను, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటుగా ముగ్గురు తమిళ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మరంగా అటవీ సమీప గ్రామాలలో తనిఖీలను చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి