రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ - రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ
తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను అదనపు ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని... తిరుమలేశుడు ఏడు ప్రధాన వాహన సేవలపై దర్శనమివ్వనున్నారు. స్వామివారి వాహన సేవలు దర్శించుకునేందుకు వచ్చే అశేష భక్త జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమాడవీధుల్లో గ్యాలరీల నిర్మాణం, భక్తుల రక్షణార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను ధర్మారెడ్డి పరిశీలించారు.