చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి కొండ పరిసరాల్లో కొండచిలువ కనిపించింది. నీరు తాగడానికి ఆలయం వద్దకు వచ్చిన జింకపిల్లపై ఆ భారీ సర్పం దాడి చేసి మింగడానికి ప్రయత్నించింది. జింక-కొండచిలువ మధ్య పోరు జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మూగజీవి చేసిన ప్రయత్నం విఫలమైంది. చనిపోయిన జింకను మింగేందుకు కొండచిలువ విఫలయత్నం చేసింది. సాధ్యం కాకపోయేసరికి జింకను వదిలి అడవిలోకి వెళ్లిపోయింది. కొంతమంది భక్తులు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు.
కొండచిలువ ఆకలి తీరలేదు... జింక ప్రాణం నిలవలేదు... - kaligirilo kondachiluva
పాపం జింక దాహార్తిని తీర్చుకునేందుకు అక్కడికి వచ్చింది. ఇంతలో కొండచిలువ ఆ మూగజీవిపై దాడి చేసింది. జింక పోరాడింది కానీ ప్రాణాలు దక్కించుకోలేకపోయింది. విగతజీవిగా పడి ఉన్న జింకను మింగేందుకు విఫలయత్నం చేసి వీలుకాక చిలువ అడవిలోకి వెళ్లిపోయింది.
కలిగిరి వెంకన్న ఆలయ పరిసరాల్లో 'కొండచిలువ'
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి కొండ పరిసరాల్లో కొండచిలువ కనిపించింది. నీరు తాగడానికి ఆలయం వద్దకు వచ్చిన జింకపిల్లపై ఆ భారీ సర్పం దాడి చేసి మింగడానికి ప్రయత్నించింది. జింక-కొండచిలువ మధ్య పోరు జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మూగజీవి చేసిన ప్రయత్నం విఫలమైంది. చనిపోయిన జింకను మింగేందుకు కొండచిలువ విఫలయత్నం చేసింది. సాధ్యం కాకపోయేసరికి జింకను వదిలి అడవిలోకి వెళ్లిపోయింది. కొంతమంది భక్తులు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు.
Intro:నిత్యం భక్తులతో అలరారే ఆలయ పరిసరాల్లో కొండచిలువ ప్రత్యక్షమై భక్తులను బెంబేలెత్తించినది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి కొండ పరిసరాలలో కొండచిలువ కనిపించి భక్తులను భయాందోళనకు గురి చేసింది.Body:అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయం కావడంతో ఆలయం వద్దకు దాహార్తిని తీర్చడానికి వచ్చిన జింక పిల్ల పై కొండచిలువ దాడి చేసి లింగ డానికి ప్రయత్నించింది. ప్రాణాలు రక్షించుకునే క్రమంలో జింకపిల్ల చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. జింకను మింగడానికి కొండచిలువ విఫలయత్నం చేసింది. కొద్దిసేపటికి జింకను వదిలి కొండచిలువ అడవిలో కి జారుకుంది.Conclusion:కొండచిలువ ఆలయ పరిసరాల్లో జింకపిల్ల పై దాడి చేసిన విషయాన్ని గుర్తించిన భక్తులు దృశ్యాలను చరవాణి లో చిత్రీకరించారు. కొండచిలువ వెళ్లిపోవడంతో సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించిన భక్తులు జింక పిల్లను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.