మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని పుంగనూరు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ అనీషారెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో అధికారులతో ఎస్ఈసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వినతిపత్రం అందజేశారు. కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలను ఆయనకు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ సానూకూలంగా స్పందించినట్లు అనీషారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ.. ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ