ఎట్టకేలకు అధికారులు నిన్న రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు శ్రమించి లోపాన్ని సరిదిద్ది విద్యుత్ సరఫరా బాక్ ఫీడింగ్ ద్వారా పునరుద్ధరించారు. నిన్నటినుంచి ఇవాళ ఉదయం 11.30 వరకు విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం వలన ప్రతి గంటకు 82 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మాచ్‌ఖండ్‌లో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అధికారులు దశల వారీగా జనరేటర్లను వినియోగంలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి - power
సాంకేతికలోపంతో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిలిచింది. దీని వల్ల వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
మాచ్‌ఖండ్
ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం విశాఖ ఫీడర్స్‌లో సాంకేతికలోపo తలెత్తి.. వినియోగంలో ఉన్న అయిదు జనరేటర్లు నిలిచిపోయాయి. అనంతరం అధికారులు నిన్న రాత్రి రెండు జనరేటర్లు వినియోగంలోకి తెచ్చినప్పటికీ మళ్లీ వెంటనే నిలిచిపోయాయి. విద్యుత్ కేంద్రంలోని ఆక్సలరీస్లో తలెత్తిన లోపం వలన మాచ్ఖండ్తో పాటు జోలపుట్, ఒనకడిల్లిలో అంధకారం అలుముకుంది.
ఎట్టకేలకు అధికారులు నిన్న రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు శ్రమించి లోపాన్ని సరిదిద్ది విద్యుత్ సరఫరా బాక్ ఫీడింగ్ ద్వారా పునరుద్ధరించారు. నిన్నటినుంచి ఇవాళ ఉదయం 11.30 వరకు విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం వలన ప్రతి గంటకు 82 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మాచ్‌ఖండ్‌లో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అధికారులు దశల వారీగా జనరేటర్లను వినియోగంలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
New Delhi, Jun 01 (ANI): Prakash Javadekar takes charge as the Minister of Environment, Forest and Climate Change. Babul Supriyo, MoS in the same ministry was also present. He will also oversee the Information and Broadcasting Ministry. Javadekar in the previous BJP government had undertaken responsibilities of various ministries including Human Resources and Development, and Parliamentary Affairs. Babul Supriyo took charge as the Minister of State in the Ministry of Environment, Forest and Climate Change.