చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం మండలం గండ్రాజుపల్లె సమీపంలో కర్ణాటక నుంచి వస్తున్న రెండు కార్లను తనిఖీ చేశారు. ఆ వాహనాల్లో 730 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్.. నగదు స్వాధీనం