తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడుపై తెదేపా నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బీఎన్ కండ్రిగ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్వీ నాయుడు ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించి దొంగఓట్లకు పాల్పడ్డారని ఆరోపించారు. తెదేపా నేతల ఫిర్యాదుతో ఎస్వీ నాయుడుకు పోలీసులు నోటీసులు అందజేశారు. రాత్రి ఏడు గంటల వరకు ప్రధాన రహదారిపై ఆపేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడును విడిచిపెట్టారు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్వీ నాయుడు.. అక్కడినుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యేకు నచ్చజెప్పి పంపించేశారు.
ఇదీచదవండి.