ఆస్పత్రుల్లో మృతదేహాలపై ఆభరణాలు మాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 23న నగరంలోని స్విమ్స్ ఆస్పత్రిలో శవాల నుంచి ఆభరణాలు మాయం చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి నుంచి ఓ వార్డు బాయ్, ఓ నర్సు ఆభరణాలు చోరీ చేశారని అన్నారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... వారి ఆభరణాలు మాయం చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించామని అన్నారు. వాళ్లను అదుపులోకి తీసకుని.. నాలుగు బంగారు ఉంగరాలు, ఆరు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం అని ఎస్పీ రమేశ్ రెడ్డి వివరించారు. కనీసం మానవత్వం లేకుండా అలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి: