బెంగళూరు నుంచి స్వగ్రామాలకు తిరుగు పయనమైన వలస కూలీలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన 32 మంది, బిహర్‌కు చెందిన 145 మంది వలస కూలీలను చిత్తూరు చీలికబైలు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సమాచారాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లె తహసీల్దార్ సురేశ్‌బాబుకు సమాచారం అందించారు. ఝార్ఖండ్ కు చెందిన 32 మంది కార్మికులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వీరికి ప్రథమ చికిత్స చేయించి సొంత రాష్ట్రానికి పంపనున్నారు. మిగిలిన 145 మంది బిహార్ వలస కూలీలను రాష్ట్ర సరిహద్దులోనే ఉంచారు. వీరిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
జిల్లా సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకున్నపోలీసులు - migrant workers latest news chittoor
బెంగళూరు నుంచి సొంత రాష్ట్రానికి తిరుగుపయనమైన ఝార్ఖండ్, బిహార్‌కు చెందిన వలస కార్మికులు చిత్తూరు జిల్లా చీలికబైలు చెక్‌పోస్టుకు చేరుకున్నారు. వారిని అక్కడ పోలీసులు అడ్డుకొని మదనపల్లి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు.