ETV Bharat / state

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్టు.. 15 వాహనాలు స్వాధీనం

చెడు వ్యసనాలకు బానిసై రెండునెలలుగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురిని చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పదిహేను ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

police arrested thiefs gang in puttur
పుత్తూరులో బైకులు చోరీ చేసే ముఠా అరెస్ట్
author img

By

Published : Jul 1, 2021, 3:59 PM IST

ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చెడువ్యసనాలకు బానిసైన... గేట్ పుత్తూరు సమీపంలో నివసించే మస్తాన్ (19), లోకేష్ (20), వెదురుకుప్పం మండలానికి చెందిన భానుప్రకాశ్ (20)లు కలసి బైకులు దొంగతనం చేసేవారు. చెడు వ్యసనాలైనా గంజా , మద్యం , ఇతర డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటుపడి, వాటి ఖర్చు కోసం..గత రెండు నెలలనుంచి చోరీలకు పాల్పడుతున్నారు.

పుత్తూరు మండలం సమీపంలో గల వడమాలపేట , వెదురుకుప్పం కార్వేటినగరం , ఎస్ఆర్ పురం, జీడీనెల్లూరు మండలాలలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశారని.. డీస్పీ డాక్టర్ యశ్వంత్ తెలిపారు. అలా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను పుత్తూరు సమీపంలో అమ్మితే పట్టుబడతారని.. తెలివిగా తమిళనాడులో అమ్మేవారని ఆయన అన్నారు.

తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలుకాలోని ఉప్పర్ మెట్ట గ్రామానికి చెందిన ఆనందరాజ్ (30) అనే వ్యక్తి దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను.. అతి తక్కువ ధరకు అమ్ముతుంటాడని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిలను విచారణ చేయగా .. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను గుడియాత్తంలోని ఆనందరాజ్​కు అమ్మినట్టు చెప్పారని ..ఆయన వెల్లడించారు. దీంతో గుడియాత్తం చెందిన ఆనందరాజ్ వద్ద నుంచి పుత్తూరు సబ్ ఇన్స్​స్పెక్టర్ రామాంజనేయులు, సిబ్బంది.. పదిహేను బైకులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి.

Accidents: జిల్లాలో 2 ప్రమాదాలు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.