ETV Bharat / state

Petition in High Court on Punganur Incident: సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు.. ప్రాథమిక ఆధారాలున్నాయి: హైకోర్టు - Petition on High court in Punganur incident

Petition in High Court on Illegal Cases in Punganur Incident: పుంగనూరు, అంగళ్లు ఘటనలలో పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోచోట ఈ కేసులతో అరెస్టు అయిన బాధిత కుటుంబీకులను మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరామర్శించగా.. ఈ ఘటనలో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు పరామర్శించారు.

Petition_in_High_Court_on_Punganur_Incident

author img

By

Published : Aug 17, 2023, 5:02 PM IST

Updated : Aug 17, 2023, 7:12 PM IST

Petition in High Court on Illegal Cases in Punganur Incident: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, అంగళ్లు ఘటనలలో తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని.. ఆ కేసు కొట్లేయాలని కోరుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు పెట్టారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దానికి సంబంధించిన తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసులు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాదనలు విన్న న్యాయస్థానం ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తీర్పు రిజర్వ్ చేసింది.

Chandrababu Phone to Punganur and Tamballapally Victims Families: "మీకు అండగా నేనుంటా.. న్యాయపోరాటం ద్వారా అందరినీ విడిపిస్తా"

Telugu Desam Leaders Visited TDP Workers in Central Jail: పుంగనూరు, అంగళ్లులో చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం దారుణమని వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మైదుకూరు టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ ఖండించారు. పుంగనూరు అంగళ్లలో జరిగిన ఘటనలలో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. త్వరలోనే అందర్నీ బయటకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అసలు దాడులు జరిగిప్పుడు ఘటనా స్థలంలో లేని వారిపై కూడా వైసీపీ నాయకులు తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆయనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Chittoor ASP on Punganur Issue: పుంగనూరు ఘటనలో 62మంది అరెస్ట్..

Renuka Reddy Visited Families Arrested in Punganur Incident.. పుంగనూరు ఘటనలో అక్రమ కేసులతో అరెస్టు అయిన బాధిత కుటుంబీకులను పెద్దపంజాణి మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరలో జరిగిన ఘటనలో పలువురిపై కేసులు బనాయించిన విషయం తెలిసిందే.. పెద్దపంజాణి మండలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించి కడప జైలుకు తీసుకెళ్లడం జరిగింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపేందుకు ఆమె స్థానిక నేతలతో కలసి గురువారం ఆ గ్రామాలలో పర్యటించారు.

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

బాధితుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అక్రమ కేసులతో ఎవరూ అధైర్య పడద్దని తామంతా మీ వెంట ఉన్నామంటూ ఆమె వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు ఎటువంటి సంబంధం లేని తమ వారిపై టీడీపీ సానుభూతిపరులనే అక్కసుతోనే ఇలా కేసులలో ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం తీవ్ర మనోవేదనకు కల్గిస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. త్వరలోనే కేసుల నుంచి విడుదలై బయటికి వస్తారని అంతవరకు సంయమనం పాటించాలని ఆమె వారికి సూచించారు.

సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు.. ప్రాథమిక ఆధారాలున్నాయి: హైకోర్టు

Last Updated : Aug 17, 2023, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.