చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో సదాశివపురంలో వరద నీటిలో చిక్కుకున్న ఎనిమిది మంది గిరిజనులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయత్నాలు ఫలించలేదు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రెస్క్యూ టీంకు సమాచారం అందించి బోట్లు తెప్పించారు. గిరిజనులను కాపాడే క్రమంలో సహాయక బృందం వెళుతున్న బోటు నుంచి ఇద్దరు సిబ్బంది అదుపుతప్పి నీటిలో పడ్డారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురికాగా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు వరదల్లో చిక్కుకున్న గిరిజనుల వద్దకి చేరుకున్నప్పటికీ చీకటి పడగా ఆపరేషన్ అర్ధాంతరంగా ముగిసింది. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న గిరిజనలు, రెస్క్యూ టీం సిబ్బందికి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.
ఇదీచదవండి