కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతలు తవ్వుతున్న తిరుపతి నగరపాలక, పోలీసు సిబ్బందిని సమీప గ్రామాల్లోని ప్రజలు అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కరోనా మృతదేహాలను పూడ్చడానికి... పొక్లెయిన్‌తో గుంత తవ్వారు. అయితే సమీప గ్రామ ప్రజలు... అక్కడికి చేరుకుని పనులు జరుగకుండా అడ్డుకున్నారు. మృత దేహాలను పూడ్చడం వల్ల ఎలాంటి నష్టం లేదని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అయినా వారు నిరాకరించటంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: