చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కనమనపల్లిలో పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడిన యువకునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికంగా నివసిస్తున్న ఓ కుటుంబం.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని కుప్పంనకు చెందిన నలుగురు యువకులు బెదిరించారు. వీరిలో ఒకడిని గుర్తించిన స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి..