చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ సెలవుపై వెళ్లాడు. దీంతో వాలంటీర్ భానుప్రియ.. ఉపాధి హామీ కూలీల వద్ద శనివారం సాయంత్రం సంతకాలు సేకరించారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది జాబ్ కార్డు లేకున్నా ఉపాధి పని చేశారు. వాలంటీర్ వారి దగ్గర సంతకాలు తీసుకోకపోవడంతో ఘర్షణకు దిగారు. భానుప్రియ తలపై రాయితో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన భానుప్రియను చంద్రగిరిలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్చారు. భానుప్రియ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: లవ్ సాక్ష్యం: ప్రేయసి కట్టించిన గుడి ఎక్కడుందో తెలుసా?