తిరుమల శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు సవ్యంగా జరగటం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తమని తితిదే పెద్దజీయర్ స్వామి ప్రకటించారు. తిరుపతిలోని పెద్దజీయర్ మఠంలో సమావేశం నిర్వహించారు. అఖండ దీపం ఆరిపోవటం మొదలు...స్వామి వారి కైంకర్యాలలో భాగమైన దిట్టం పరిమాణం తగ్గిందంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని ఆయన అన్నారు. రామానుజ పరంపరలో భాగంగా గడచిన 900 సంవత్సరాలుగా స్వామి వారి కైంకర్యాలను సంప్రదాయ, ఆగమ శాస్త్ర బద్ధంగా సాగుతున్నాయని వివరించారు.
'శ్రీవారి సేవలపై వస్తున్న ఆ వార్తలు నమ్మొద్దు' - తితిదే పూజలను వివరిస్తున్న పెద్దజీయర్ వార్తలు
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలు జరగటం లేదనే వార్తలను నమ్మోద్దని... తితిదే పెద్దజీయర్ స్వామి ప్రకటించారు. అఖండ దీపం ఆరిపోవటం వంటి వార్తలు అవాస్తవమని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు సవ్యంగా జరగటం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తమని తితిదే పెద్దజీయర్ స్వామి ప్రకటించారు. తిరుపతిలోని పెద్దజీయర్ మఠంలో సమావేశం నిర్వహించారు. అఖండ దీపం ఆరిపోవటం మొదలు...స్వామి వారి కైంకర్యాలలో భాగమైన దిట్టం పరిమాణం తగ్గిందంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని ఆయన అన్నారు. రామానుజ పరంపరలో భాగంగా గడచిన 900 సంవత్సరాలుగా స్వామి వారి కైంకర్యాలను సంప్రదాయ, ఆగమ శాస్త్ర బద్ధంగా సాగుతున్నాయని వివరించారు.
ఇదీ చదవండి: సామాజిక సేవలో భాగమైన తితిదే