వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోతే ఆసుపత్రి సిబ్బందే చికిత్స అందిస్తుంటారు. కానీ ఓ ఆసుపత్రిలోని వైద్యాధికారి తాను ఉంటేనే వైద్యం అందించాలంటూ ఆసుపత్రిలోని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఇటీవల జారీ చేసిన హుకుం వల్ల సిబ్బంది అత్యవసర పరిస్థితులైన సరే వైద్యం అందించడానికి వెనుకంజ వేస్తున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యాధికారి నిర్వాకంతో రోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తూ అవస్థలు పడుతున్నామన్నారు.
ఇది చూడండి:స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయండి: లోకేశ్