ETV Bharat / state

ఆ పంచాయతీలో పట్టుకోసం.. పోటాపోటీ..! - చిత్తూరు జిల్లా నారావారిపల్లి తాజా వార్తలు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పంచాయతీ ఎన్నికల పర్వం ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చెందిన ఆ పంచాయతీలో పట్టుకోసం ఒకరు.. పరువు కోసం మరొకరు పోటీలు పడుతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు.

panchayat elections gets interesting in naravaripalle at chittor district
ఆ పంచాయతీలో పట్టుకోసం.. పోటాపోటీ..!
author img

By

Published : Feb 1, 2021, 2:09 PM IST

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరు ఆ పంచాయతీ వైపు దృష్టి మళ్లించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చెందిన ఆ పంచాయతీలో పట్టుకోసం ఒకరు.. పరువు కోసం మరొకరు పోటీలు పడుతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీ ఆరంభం నుంచి తెదేపా మద్దతుదారుల చేతిలో ఉంది. కందులవారిపల్లి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచిగా దేశినేని వెంకట సుబ్రమణ్యంనాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆ తరువాత కందులవారిపల్లికి చెందిన కనుమూరి చంద్రబాబునాయుడు, నారావారిపల్లికి చెందిన ఎం.సావిత్రమ్మ ఏకగ్రీవంగా పదవులు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుగా బరిలో నిలిచిన పులివర్తి బెనర్జీ విజయం సాధించగా.. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ తెదేపా మద్దతుదారు పాశం చంద్రకుమార్‌ నాయుడు విజయం సాధించారు. ఇలా మూడు పర్యాయాలు ఏకగ్రీవం, రెండు మార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఆ పంచాయతీకి తెదేపా మద్దతుదార్లు మాత్రమే సర్పంచ్‌లుగా సేవలు అందించారు.

ఎలాగైనా చేజిక్కించుకోవాలని..

తెదేపాకు కంచుకోట అయిన కందులవారిపల్లి పంచాయతీలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగా 650 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా వున్న కందులవారిపల్లికి పక్కనున్న శేషాపురం, బి.కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి సుమారు 1460 ఓట్లతో ఎన్నికలు జరిగేలా చేశారు. అంతటితో ఆగక ఆ పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఓసీ (మహిళ) రిజర్వేషన్‌ను కల్పించారు. వైకాపా మద్దతు దారుగా కమ్మ సామాజిక వర్గం నుంచే సర్పంచి స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఎత్తులకు పైఎత్తులు వేస్తూ..

కందులవారిపల్లి పంచాయతీని ఎట్టి పరిస్థితిల్లోనూ వైకాపా మద్దతుదారుల చేతికి వెళ్లకుండా కట్టడి చేసేందుకు తెదేపా నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెదేపా బాధ్యులు పులివర్తి నాని ఆ పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు పంచాయతీ పెద్దలతో సమాలోచనలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌బాబుకు అధికార పార్టీ నేతల నుంచి మాట రానీయకుండా అందరు కలసికట్టుగా పనిచేయాలని తెదేపా నేతలు, కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ పంచాయతీ సర్పంచి స్థానానికి తెదేపా మద్దతు దారుగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు స్థానిక నేతలు నిమగ్నమయ్యారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఆ పంచాయతీపై పట్టుకోసం పోటీలు పడుతున్నారు.

ఇదీ చదవండి:

లంక గ్రామాల్లో ఓటుకు అర్థమే వేరు.. ఎన్నికల్లో కట్టుబాట్లదే పైచేయి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.